IND vs AUS: పక్కనపెట్టేందుకు కారణం ఏదీ లేదు.. సర్ఫరాజ్ తుది జట్టులో ఉండాల్సిందే!
- ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్
- సర్ఫరాజ్‌కు ఆకాష్ మద్దతు
- కారణం ఏదీ కనిపించడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు రోజురోజుకు మాజీల నుంచి మద్దతు పెరుగుతోంది. సర్ఫరాజ్‌కు ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సపోర్ట్ చేయగా.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా మద్దతు ఇచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సర్ఫరాజ్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఆకాశ్ సూచించాడు. అతడిని పక్కనపెట్టేందుకు కారణం ఏదీ కనిపించడం లేదన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఈ వారంలోగా బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
బుధవారం ఓ వర్చువల్ ఇంటరాక్షన్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ… ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకోసం బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. స్క్వాడ్‌లోనే కాదు తుది జట్టులోనూ సర్ఫరాజ్ ఖాన్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియా గడ్డపై భారీ టెస్టు సిరీస్‌ను భారత్ ఆడబోతోంది. సర్ఫరాజ్ ఎక్కడైనా రాణిస్తాడనే నమ్మకం ఉంది. న్యూజిలాండ్‌పై సూపర్ సెంచరీ చేశాడు. అంతకుముందు ఇంగ్లండ్‌పైనా దూకుడుగా ఆడాడు. ఆసీస్‌తో పర్యటనకు సర్ఫరాజ్‌ను పక్కనపెట్టేందుకు కారణం ఏదీ కనిపించడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడు కచ్చితంగా ఉంటాడని భావిస్తున్నా’ అని అన్నాడు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: IND vs NZ 2nd Test: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. మూడు మార్పులతో భారత్! తుది జట్లు ఇవే
‘ప్రతి పనికి ఓ డెడ్‌లైన్ ఉంటుంది. లేకపోతే ఫలితం అనుకున్నవిధంగా రాదు. క్రికెట్‌లో పరుగులు చేయకుండా, వికెట్లు తీయకుండా ఉంటే.. ఎంతటి ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. జాతీయ జట్టు తరఫున ఆడే ప్రతిఒక్కరికీ నిబంధనలు ఒకేలా ఉంటాయి. కేవలం కేఎల్ రాహుల్ గురించి మాత్రమే నేను మాట్లాడడం లేదు. వ్యక్తిగత ప్రదర్శన మెరుగ్గా ఉంటే జట్టులో ఉంటారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఫర్వాలేదనిపించిన మద్దతుగా నిలిచాం. న్యూజిలాండ్‌పై తేలిపోయాడు. అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!