NTV Telugu Site icon

IND vs AUS: పక్కనపెట్టేందుకు కారణం ఏదీ లేదు.. సర్ఫరాజ్‌ తుది జట్టులో ఉండాల్సిందే!

Sarfaraz Khan

Sarfaraz Khan

టీమిండియా నయా బ్యాటింగ్‌ సెన్సేషన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌కు రోజురోజుకు మాజీల నుంచి మద్దతు పెరుగుతోంది. సర్ఫరాజ్‌కు ఇప్పటికే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ సపోర్ట్ చేయగా.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా కూడా మద్దతు ఇచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సర్ఫరాజ్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఆకాశ్‌ సూచించాడు. అతడిని పక్కనపెట్టేందుకు కారణం ఏదీ కనిపించడం లేదన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఈ వారంలోగా బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

బుధవారం ఓ వర్చువల్ ఇంటరాక్షన్‌లో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ… ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకోసం బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. స్క్వాడ్‌లోనే కాదు తుది జట్టులోనూ సర్ఫరాజ్‌ ఖాన్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియా గడ్డపై భారీ టెస్టు సిరీస్‌ను భారత్‌ ఆడబోతోంది. సర్ఫరాజ్‌ ఎక్కడైనా రాణిస్తాడనే నమ్మకం ఉంది. న్యూజిలాండ్‌పై సూపర్ సెంచరీ చేశాడు. అంతకుముందు ఇంగ్లండ్‌పైనా దూకుడుగా ఆడాడు. ఆసీస్‌తో పర్యటనకు సర్ఫరాజ్‌ను పక్కనపెట్టేందుకు కారణం ఏదీ కనిపించడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడు కచ్చితంగా ఉంటాడని భావిస్తున్నా’ అని అన్నాడు.

Also Read: IND vs NZ 2nd Test: టాస్ గెలిచిన న్యూజిలాండ్‌.. మూడు మార్పులతో భారత్! తుది జట్లు ఇవే

‘ప్రతి పనికి ఓ డెడ్‌లైన్ ఉంటుంది. లేకపోతే ఫలితం అనుకున్నవిధంగా రాదు. క్రికెట్‌లో పరుగులు చేయకుండా, వికెట్లు తీయకుండా ఉంటే.. ఎంతటి ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. జాతీయ జట్టు తరఫున ఆడే ప్రతిఒక్కరికీ నిబంధనలు ఒకేలా ఉంటాయి. కేవలం కేఎల్‌ రాహుల్ గురించి మాత్రమే నేను మాట్లాడడం లేదు. వ్యక్తిగత ప్రదర్శన మెరుగ్గా ఉంటే జట్టులో ఉంటారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఫర్వాలేదనిపించిన మద్దతుగా నిలిచాం. న్యూజిలాండ్‌పై తేలిపోయాడు. అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

Show comments