Site icon NTV Telugu

Aakasam Dhaati Vasthaava : మనసుకు హత్తుకునేలా వున్నా ఉన్నానో లేనో లిరికల్ సాంగ్..

Whatsapp Image 2023 09 22 At 10.45.42 Pm

Whatsapp Image 2023 09 22 At 10.45.42 Pm

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ కొత్త వారితో సినిమాలు చేస్తూ వుంటారు.ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వుంటారు.. ఇందులో భాగంగానే ఆయన నిర్మాణంలో రాబోతున్న మరో కొత్త చిత్రం ఆకాశం దాటి వస్తావా.ప్రముఖ డాన్స్ మాస్టర్ యష్‌ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు ప్రొడక్షన్‌లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాకు శశి కుమార్‌ ముతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక మురళీధరన్‌ కథానాయికగా నటిస్తోంది. ర్యాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్​కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ చిత్రం నుంచి ఉన్నానో లేనో లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాట ఎంతో కూల్​గా మనసుకు హత్తుకునేలా ఉంది. కార్తిక్ అందించిన మ్యూజిక్ ట్యూన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆయనే స్వయంగా ఈ పాటను ఆలపించడం జరిగింది.. ఆయన పాడిన విధానం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ సాంగ్ కు భరద్వాజ్ పాత్రుడు అద్భుతమైన లిరిక్స్ అందించారు.ఈ సాంగ్ లో యశ్-కార్తికా మురళిధరన్ మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఈ పాట వింటుంటే ప్రతి ఒక్కరీ ప్లే లిస్ట్ చార్ట్ లో కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ పాటలో అంత మంచి ఫీల్ వుంది.జీవితంలో ప్రేమ, సమయం మరియు డబ్బులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా కూడా ఆ బంధంలో గొడవలు జరుగుతాయి. ఆ నేపథ్యంతోనే సినిమాను మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిస్తున్నామని మూవీ టీమ్ చెబుతోంది.మరి ఈ సినిమా విడుదల అయినాక ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి

Exit mobile version