NTV Telugu Site icon

Aadi Srinivas : చేవెళ్ల చెల్లెమ్మ అని కాంగ్రెస్ పార్టీ సబితమ్మను గౌరవించింది

Aadi Srinivas

Aadi Srinivas

అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో కేటీఆర్ రన్నింగ్ కామెంట్రి, సభను తప్పు దోవ పట్టించే విధంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అగౌరపరిచేలా ఎక్కడా మాట్లాడలేదన్నారు. గతంలో కేసీఆర్ మహిళలను వ్యక్తి గతంగా కించపరిచే మాటలు మాట్లాడిన సబితమ్మకు గుర్తు లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళ గవర్నర్‌ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ప్రజలకు తెలుసు అని, సీఎల్పీ గా భట్టి విక్రమార్క ను జీర్ణించుకోలేక సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారిందన్నారు. 2018 లో కాంగ్రెస్ లో గెలిచి trs లో చేరిందని, చేవెళ్ల చెల్లెమ్మ అని కాంగ్రెస్ పార్టీ సబితమ్మను గౌరవించిందన్నారు ఆది శ్రీనివాస్‌. కేసీఆర్ పన్నిన ఉచ్చులో సబితా ఇంద్రారెడ్డి చిక్కుకుందని, పది ఏండ్లు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండన్నారు.

అందుకే జీర్ణించుకోలేక పోతున్నారని, హౌస్ నుండి పారి పోయి పామ్ హౌస్ లో పండుకుంది కేసీఆర్ కాదా….కేటీఆర్ అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజలకోసం ఎందుకోసం మాట్లాడట్లేదని, ప్రపంచంలో ఉక్కు మహిళల ఇందిరా గాంధీ ని అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, బీఆర్ ఎస్ పార్టీలో మహిళలను రాష్ట్ర అధ్యకురాలిని చేసే దమ్ము ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పారని, అన్ని పార్టీల సభ్యులకు టైం కేటాయించి తెల్లవార్లు సభను నడిపి దేశంలోనే చరిత్ర నెలకోల్పిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదన్నారు.