ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన నేపథ్యంలో, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు బాబీ, వశిష్ట మరియు హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆదికి సక్సెస్ రావడం నా కుటుంబ సభ్యుడు గెలిచినంత ఆనందంగా ఉంది. సాయి కుమార్ కుటుంబంతో మాకు మూడు తరాల అనుబంధం ఉంది. ‘శంబాల’ ట్రైలర్ చూడగానే బన్నీ మెసేజ్ చేశాడు. ఆది ఇక నుంచి హైవే ఎక్కినట్టు దూసుకుపోవాలి. ఈ సినిమాని నేను చాలా ఎంజాయ్ చేశాను అని తెలిపారు’ అరవింద్. అలాగే
Also Read : Anil Ravipudi-Prabhas : ప్రభాస్ పై అనిల్ రావిపూడి ప్రశంసలు.. సీనియర్ల పట్ల రెబల్ స్టార్ గౌరవానికి ఫిదా!
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘ఆది మంచితనం వల్లే ఇండస్ట్రీ అంతా ఇక్కడికి వచ్చింది. సక్సెస్ కొట్టిన తర్వాత కూడా సాయి కుమార్ గారు ఇంకా రిలాక్స్ అవ్వకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆదికి చాలా గట్టి సక్సెస్ దక్కింది’ అని తెలిపారు. సందీప్ కిషన్ కూడా ముఖ్య అథిదిగా పాల్గోన్నగా.. ‘నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ‘శంబాల’ నిరూపించింది. ఆదికి హిట్ వస్తే నాకు వచ్చినట్టే. నిర్మాతగా ఆదితో నేను చేసే సినిమా నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది’ అని తెలిపాడు. ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ విజయం వెనుక డైరెక్టర్ యుగంధర్ రెండేళ్ల కష్టం ఉంది. ప్రతీ క్రెడిట్ ఆయనకే దక్కాలి. ప్రభాస్ గారు మా ట్రైలర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేశారు. అల్లు అరవింద్ గారు అడిగిన వెంటనే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇకపై కొత్త ఆదిని చూస్తారు, చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తాను. ‘శంబాల’ని థియేటర్ లో చూడండి, కచ్చితంగా డిజప్పాయింట్ అవ్వరు’ అని తెలిపారు.
సాయి కుమార్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆదికి ఇలాంటి హిట్ రావడం ఆడియన్స్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్. ‘ప్రేమ కావాలి’ నుంచి ఆది కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ‘మన ఆది హిట్ కొట్టాడు’ అని అందరూ అంటుంటే తండ్రిగా చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు.
