NTV Telugu Site icon

Aadhaar Ration Card Link: ఆధార్, రేషన్ కార్డు లింక్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

New Project (6)

New Project (6)

ఆధార్-రేషన్ కార్డు లింక్ పై కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్-రేషన్ కార్డు లింక్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది. జూన్ 30తో ఉన్న గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, విద్య, వైద్య పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం. వైట్ రేషన్ కార్డుదారులను ప్రభుత్వ పథకాలకు అర్హులుగా తీసుకుంటారు. అయితే రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్-రేషన్ కార్డులను లింక్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది. రేషన్ డీలర్లు ఈ ప్రక్రియను చేపట్టారు.

READ MORE: Rajasthan: ఆ గ్రామంలో అందరూ ధనవంతులే.. ప్రభుత్వానికి ఏటా 5కోట్ల పన్నులు చెల్లిస్తారు

2024 జూన్‌ 30తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. ఆధార్‌- రేషన్‌ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్‌ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం సమీపంలోని రేషన్‌ షాప్‌ లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC) సాయంతో లింక్‌ చేయించుకోవచ్చు. ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌ పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది.

Show comments