NTV Telugu Site icon

Hyderabad: ఐదేళ్ల బాలుడిపై యువకుడి లైంగిక దాడికి యత్నం.. బాత్రూంలోకి తీసుకెళ్లి..

Sexually Assault

Sexually Assault

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం విచ్చేసిన కార్మికుడి కుమారుడు జంతర్ (5)పై లైంగిక దాడికి యత్నించాడు. పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా బాలుడికి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. నోరుమూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలుడు కేకలు వేశాడు. అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులు అతడిని బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులకు తీసుకున్నారు.

READ MORE: Hyderabad: గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని ఆస్పత్రి పాలైన యువకుడు.. ఏం కలిపారంటే?

Show comments