రోజు రోజుకు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రేమ నిరాకరించినా.. పెళ్లి నిరాకరించినా.. అమ్మాయిలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కురిచేడులో పెళ్లికి నిరాకరించిందని యువతిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేశాడో యువకుడు.. మద్యం సీసాతో గొంతు కోసి ముఖంపై గాయాలు చేసి పరారయ్యాడు సదరు దుర్మార్గుడు. అలవలపాడు పోస్టాఫీసులో పనిచేస్తూ స్నేహితులతో కలసి కురిచేడులో ఓ రూంలో యువతి ఉంటోంది. గతంలో యువతిని పలుమార్లు పెళ్లి చేసుకోవాలని ఆమె స్వగ్రామానికి చెందిన వీరనారాయణాచారి అనే యువకుడు వేధించాడు.
Also Read : Bhola Shankar : ఆ విషయంలో దర్శకుడు మెహర్ రమేష్ మిస్టేక్ చేసాడా..?
దీంతో.. యువతి తల్లిదండ్రులు సదరు యువకుడిని మందలించారు. ఈక్రమంలో.. యువతిపై కక్ష్య పెంచుకుని ఓ కారులో మరో ఇద్దరు యువకులతో కలసి వచ్చి యువతిని ఎత్తుకెళ్లాడు యువకుడు.. కారులో దొనకొండ సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి మద్యం సీసతో దాడి చేసి.. అనంతరం కురిచేడులో వదిలివెళ్లాడు నిందితులు. దీంతో.. బాధితు యువతిని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
Also Read : CM KCR : ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది