Women Beats Boy in Puducherry: భారతదేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఆడవాళ్లపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ప్రతిరోజు ఏదో ఓ చోట మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. హత్యలు, హత్యాచారాలు, వేధింపులకు మహిళలు గురవుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన వెంటపడిన ఓ యువకుడికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.
పుదుచ్చేరి బస్ స్టేషన్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతితో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. నది రోడ్డుపైనే యువతితో అసభ్యకరంగా మాట్లాడుతూ వెంటపడ్డాడు. ముందుగా యువతి మాటలతో అతడిని అడ్డుకుంది. మాటలతో చెప్పిన ఫలితం లేకపోవడంతో యువకుడుని అందరూ చూస్తుండగానే చితకబాదింది. యువకుడి మర్మాంగాలపై తన్నడంతో అతడు విలవిల్లాడిపోయాడు. ఆపై యువతి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
Also Read: IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20.. ఆట సాగేనా?
యువకుడిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు యువతి ధైర్యానికి ఫిదా అవుతున్నారు. మహిళలో స్పూర్తి నింపావంటూ పోస్టులు పెడుతున్నారు. హ్యాట్సాఫ్ అమ్మా, మంచి పని చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన డిసెంబర్ 9న మధ్యాహ్నం జరుగునట్లు తెలుస్తోంది.