యూపీలోని అమ్రోహాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. చికిత్స నిమిత్తం ఓ తాంత్రికుడి దగ్గరికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి అసభ్యకరమైన వీడియో తీశాడు. అయితే.. దానిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నడు. అంతే కాకుండా.. బాధితురాలి నుంచి లక్ష రూపాయల వరకు దోచుకున్నాడు. తనకు తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో.. బాధితురాలు నిందితుడితో పాటు అతని సహచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Minister Savitha: గుడ్‌న్యూస్.. ఏపీలో త్వరలో నూతన టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ
వివరాల్లోకి వెళ్తే.. సంభాల్ జిల్లాలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో.. యువతి బంధువు తనకు తెలిసిన తాంత్రికుడు ఒకడున్నాడని.. అతను నీ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చేస్తాడని యువతికి చెప్పాడు. దీంతో.. తాంత్రికుడిని సంప్రదించిన బాధిత యువతి, గత సంవత్సరం జూన్ నెలలో తాంత్రికుడు బాలికకు మత్తు మందు ఇచ్చి చికిత్స నెపంతో అత్యాచారం చేసి వీడియో తీశాడు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read Also: Wayanad: వయనాడ్‌లో ‘పోర్క్ ఛాలెంజ్’పై రచ్చ.. ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం
ఈ క్రమంలోనే తాంత్రికుడు యువతి నుంచి రూ. లక్ష వరకు లాక్కున్నాడు. అంతేకాకుండా.. రాజున్హాకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని తాంత్రికుడు యువతిపై ఒత్తిడి తెచ్చాడు. దానికి బాధితురాలు నిరాకరించడంతో సహచరులతో కలిసి ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాంత్రికుడు పుష్పేంద్రతో పాటు అతని సహచరులపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
