Visakhapatnam: ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి..
- భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో దారుణ ఘటన
- యువ టీచర్‌ను వేధింపులకు గురి చేసిన యువకుడు
- కొన్నేళ్లుగా వెంటపడి ప్రేమపేరిట వేధింపులు
- పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు కొన్నేళ్లుగా ఈమె వెంటపడి ప్రేమపేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో విసుగు చెందిన యువతి పొలాల్లో జల్లడానికి ఇంట్లో భద్రపరిచిన పురుగుల మందును ఈనెల 16వ తేదీ సాయంత్రం తాగింది. ఇంట్లోని వారు గమనించి తగరపువలస ఎన్నారై ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మృత్యువుతో పోరాడుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది.
READ MORE: Maharashtra: ఆరు నెలల్లోనే భారీ మార్పు.. “మహాయుతి” విజయంలో ఆర్‌ఎస్ఎస్ పాత్ర ఏంటి?
Also Read
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
శుక్రవారం ఉదయం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. యువతి మృతికి కారకుడైన రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. ఈ విషయాలు బయటికి రాకుండా కుటుంబీకులు జాగ్రత్త పడ్డారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!