Site icon NTV Telugu

Hyderabad: బర్త్‌డే పార్టీకి పిలిచి.. యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు..

Murder

Murder

నార్సింగిలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. అల్కపూరి కాలనీ లో ఐడిపిఎల్ కు చెందిన రోహిత్ అనే యువకుడిని స్నేహితులు కొట్టి చంపేశారు. స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొనడానికి ఐడీపీఎస్ నుంచి అల్కాపూర్ కాలనీకి వచ్చాడు. బర్త్ డే పార్టీలో స్నేహితులు ఫుల్ గా మద్యం సేవించారు. అనంతరం రోహిత్ పై దాడి చేశారు. పార్టీకి వచ్చిన స్నేహితుడు బీర్ బాటిల్ తో తలపై మోదాడు. దీంతో రోహిత్ స్పాట్ లో కుప్పకూలాడు. అనంతరం మిగతా స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. పథకం ప్రకారం రోహిత్ ను బర్త్ డే పార్టీకి పిలిపించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అక్బర్ తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. హంతకుడి కోసం మూడు టీమ్స్ వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

READ MORE: Koti Deepotsavam 2024: కార్తీక పూర్ణిమ శుభవేళ.. కొనసాగుతున్న ప్రత్యేక పూజలు

Exit mobile version