Site icon NTV Telugu

Suicide Attempt: ఎఫైర్‌ను బయటపెడుతారన్న భయంతో ఉరేసుకున్న యువకుడు

Suicide Attempt

Suicide Attempt

Suicide Attempt: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వివాహేతర సంబంధాన్ని బయటపెడతారన్న భయంతో మాదు మనోహర్‌ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియోతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ వివాహిత మహిళతో మనోహర్‌ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆ మహిళ తన భర్తని వదిలేసి వస్తానంటే మనోహర్‌ వద్దన్నాడు. అతను వద్దనడంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. మహిళ మరణానంతరం విషయం బయటకు రావడంతో ఆ కేసులో మూడు నెలలు జైలు శిక్షను మనోహర్ అనుభవించాడు.

Read Also: IT Gang: గ్యాంగ్‌ మూవీ సీన్ రిపీట్.. ఐటీ అధికారులమంటూ..

జైలు నుంచి వచ్చిన తర్వాత పొలం పనులకు వెళుతుంటే చనిపోయిన మహిళతో తాను సన్నిహితంగా ఉన్న వీడియో బయట పెడతామంటూ ముగ్గురు వ్యక్తులు బెదిరిస్తున్నారని మనోహర్ తాను రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తెలిపాడు. బుధవారం సాయంత్రం మైలవరంలోని తన ఇంట్లో ఎవరూ లేనప్పుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మనోహర్‌ ఉరేసుకున్నాడు. ఇంతలోనే బావి వద్ద నుంచి వచ్చిన కుటుంబసభ్యులు గమనించి అతడిని కాపాడారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version