Site icon NTV Telugu

Madhya Pradesh: మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన కార్మికురాలు

Acid

Acid

ఓ మహిళ కార్మికురాలు.. బాటిళ్లను క్లీన్ చేసే ఫ్యాక్టరీలో పని చేస్తుంది. అయితే పని చేస్తున్న సమయంలో ఆమెకు దాహం వేయడంతో దీంతో తన తోటి కార్మికురాలుని నీళ్లు ఇవ్వాలని కోరింది. అయితే, ఆమె చూసుకోకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చింది.. దాన్ని మంచి నీళ్లు అనుకుని సదరు మహిళ తాగేసింది. దీంతో ఒక్కసారిగా నోటిలో విపరీతమైన మంట ప్రారంభమైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

Read Also: Sunday Stotram: ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలో రింకూ ఠాక్రే అనే కార్మికులు నివాసం ఉంటుంది. తన జీవనోపాధి కోసం అదే జిల్లాలో ఉన్న బాటిళ్లను శుభ్రం చేసే ఫ్యాక్టరీలో ఆమె పని చేసేది. ఎప్పటిలాగే నిన్న (శనివారం) కూడా ఫ్యాక్టరీలోకి పనికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు బాగా దాహం వేసింది. దీంతో తన పక్కనే పని చేస్తున్న ఓ మహిళను తాగేందుకు నీళ్లు ఇవ్వాలని అడిగింది. కానీ పని ధ్యాసలో ఉన్న ఆమె సరిగ్గా చూసుకోకుండా రింకూకు ఓ సీసాను ఇచ్చింది.

Read Also: Surya Stotram: ఆదివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి

అయితే, అది మామూలు మంచి నీళ్లే అనుకొని రింకూ ఠాక్రే తాగేసింది. కానీ అందులో యాసిడ్ ఉందని ఆమె గమనించలేదు. దీంతో ఒక్క సారిగా కడుపులో, నోట్లో మంట మంట అంటూ ఆమె ఆరవడం ప్రారంభించింది. ఒక్కసారిగా ఫ్యాక్టరీ సిబ్బంది, తోటి కార్మికులు వెంటనే రింకూ ఠాక్రేను సమీపంలోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version