NTV Telugu Site icon

Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త

Blood

Blood

Menstrual Blood : ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. మహారాష్ట్రలో ఈ దారుణం వెలుగు చూసింది. అఘోరీ విద్య కోసం అత్త సొంత కోడలు రుతుక్రమ రక్తాన్ని అమ్మేసినట్లు తెలిసింది. ఈ కేసులో బాధితురాలు పూణెలోని విశ్రాంత్‌వాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయబడింది. విశ్రాంతవాడి పోలీసులు చేతబడి చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం బీడ్ పోలీసులకు కేసును బదిలీ చేశారు.

Read Also: Taneti Vanitha: విపత్తులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం

మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన 2022 ఆగస్టులో జరిగింది. బీడులో అత్తమామల దగ్గరకు వెళ్ళినప్పుడు పలు కారణాలతో చిత్ర హింసలకు గురిచేసేవారని ఆమె పేర్కొ్ంది. అదనపు కట్నం తీసుకురావాలని బాగా కొట్టేవారని తెలిపింది. మహిళతో ఆ పని చేయించినట్లు ఫిర్యాదుదారు పోలీసులను ఆశ్రయించింది. బహిష్టు రక్తాన్ని దూదితో తీసి సీసాలో సేకరించారు. ఆ తర్వాత ఈ రక్తాన్ని పూజకోసం రూ.50 వేలకు అఘోరాకు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పూర్తి వివరాలు.. పూణెలోని విశ్రాంతంవాడి ప్రాంతానికి చెందిన బాధితురాలు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ తన భర్తతో కలిసి బీడ్ జిల్లాలోని అత్తమామలతో కలిసి నివసించేందుకు వెళ్లింది. ఒకనొక నెలలో రుతుస్రావం తరువాత, ఆమె అత్తమామలు ఆ మహిళ చేతులు, కాళ్ళు కట్టివేసి బహిష్టు రక్తాన్ని దూదితో సేకరించి సీసాలో నింపారు. తర్వాత, ఈ రక్తాన్ని మంత్రగాడికి రూ.50 వేలకు విక్రయించారు.

Read Also: Delhi Tension Live: ఢిల్లీలో హైటెన్షన్.. ఇవాళ ఈడీ ముందుకు కవిత

దీంతో బాధితురాలు తన పుట్టినింటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఎన్జీవో ద్వారా నేరుగా విశ్రాంతివాడి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి నిందితులపై కేసు పెట్టారు. విశ్రాంత్‌వాడి పోలీసులు మహారాష్ట్ర అట్రాసియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ విచ్‌క్రాఫ్ట్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Show comments