NTV Telugu Site icon

Fatal Accident: బస్సు కిటికీ నుంచి తల బయటకు పెట్టిన మహిళ.. వెనుక నుంచి ట్రక్కు ఢీ

Up Road Accident

Up Road Accident

ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో చూశాం. అయితే ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. సాధారణంగా మనం బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీల్లో నుంచి చేతులు, తల బయటపెట్టకూడదు అని హెచ్చరిస్తూ బస్సులో రాసి ఉంటాయి. అయితే వీటిని చాలా మంది పట్టించుకోరు. కొందరు వాంతి వస్తుందని, మరికొందరు బయటి ప్రదేశాలను చూడాలనో, ఇంకొందరు అత్యుత్సాహంతో తల, చేతులు బయట పెడుతుంటారు. ఆ క్రమంలో అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. ఇలాంటి ఘటనే యూపీ కౌశాంబిలోని భర్వారీలోని కోఖ్‌రాజ్ హైవేపై సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ మెడ మొండెం నుంచి విడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ తలను వెనుక నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో.. తల శరీరం నుంచి విడిపోయింది.

Gold Rates Today: మగువలకు ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

వోల్వో బస్సు భక్తులతో ప్రయాగ్‌రాజ్ నుంచి మధుర బృందావనం వెళుతోంది. అయితే.. ఈ ప్రమాదంతో మృతురాలి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి రాజస్థాన్ నుండి 40 మంది భక్తులతో వోల్వో బస్సు ప్రయాగ్‌రాజ్ నుండి మధుర బృందావనానికి వెళుతోంది. రాత్రి 2 గంటల సమయంలో కోఖ్‌రాజ్ సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 ఏళ్ల మహిళ కిటికీలోంచి చూస్తోంది. ఇంతలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఓవర్‌టేక్ చేసిందుకు ప్రయత్నించి. మహిళ తలకు తగులుకుంటూ వెళ్లింది. దీంతో.. శరీరం నుంచి విడిపోయి రోడ్డుపై పడింది.

Pet Dog: పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి.. భీమిలిలో విషాదం

కాగా.. బస్సులో ఆమె పక్కనే కూర్చున్న ఇద్దరి కూతుళ్లు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనానంతరం పారిపోతున్న ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన బాలికలను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతురాలి బంధువులకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. అర్థరాత్రి పోలీసులు విచారణ జరిపి మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.