NTV Telugu Site icon

Rewa Incident: మహిళలను సజీవంగా పాతిపెట్టినందుకు ముగ్గురు అరెస్టు.. మరో ఇద్దరు పరారీలో..

Rewa Incident

Rewa Incident

Rewa Incident Arrested: మధ్యప్రదేశ్‌ లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసిన కేసులో 5 మందిని పోలీసులు దోషులుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే బాధిత మహిళ మమతా పాండే ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఘటన అనంతరం కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా దృష్టి సారించారు. ఆదివారం నాడు హీనౌతా కోథర్‌ లోని భూవివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణ స్థలంలో రోడ్డు నిర్మాణం విషయంలో గౌకరన్‌ పాండేతో తమ కుటుంబానికి గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదుదారు సురేష్‌ పాండే భార్య ఆశాపాండే (25) పోలీసులకు తెలిపారు.

ICC World cup Teams: రాబోయే ప్రపంచకప్‭లో మరిన్ని కొత్త జట్లు.. ఐసీసీ కీలక ప్రకటన..

శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గౌకరన్ పాండే, బావ విపిన్ పాండేలు వివాదాస్పద స్థలంలో రోడ్డు నిర్మించేందుకు హైవా నుంచి మట్టిని తీసుకొచ్చారు. దీని తర్వాత ఆశా పాండే తన కోడలు మమతా పాండేతో కలిసి డంపర్ డ్రైవర్‌ ను బాత్రూమ్ కూల్చివేయడాన్నీ నిరాకరించారు. హఠాత్తుగా డంపర్ డ్రైవర్ బురదను త్వరగా పడేశాడు. దాంతో బాధితులు మట్టిలో కూరుకుపోవడం జరిగింది. ఈ సంఘటనలో వెంటనే అక్కడ ఉన్న గ్రామస్థులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

Charlie Cassell: పెను సంచలనం.. మొదటి మ్యాచ్ లోనే 7 వికెట్లు తీసిన బౌలర్..

ఈ విషయానికి సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగవాన పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హనౌత కోథార్‌ గ్రామంలో కుటుంబ వివాదంలో ఇద్దరు మహిళలపై బురద చల్లిన కేసులో పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి ముగ్గురు నిందితులని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చికిత్స అనంతరం మహిళలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మధ్యప్రదేశ్ పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల భద్రత ప్రభుత్వ ప్రధానాంశం అని., వారిపై ఎలాంటి అఘాయిత్యం చేసినా నిందితులను విడిచిపెట్టమని., వారికి కఠిన శిక్ష విధించబడుతుందని ముఖ్యమంత్రి అన్నారు.