NTV Telugu Site icon

Delivery in an Ambulance : కదిలే రైలులో గర్భిణీకి పురిటి నొప్పులు.. అంబులెన్స్‌లో ప్రసవం

Delivery In An Ambulance

Delivery In An Ambulance

గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో యశ్వంత్‌పూర్ ధనపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం తెల్లవారుజామున పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగింది. అనితాదేవి తన సోదరుడు వినయ్ కుమార్, పిల్లలతో కలిసి బెంగళూరు నుంచి బెనారస్ రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు తెల్లవారుజామున 2.45 గంటలకు పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు రైల్వే అధికారులకు తెలియజేయడంతో వారు రైలును స్టేషన్‌లో నిలిపివేసి అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు.

Also Read : Nizamabad : తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఆరేళ్ల కూతురుపై అత్యాచారం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి

రైల్వే కంట్రోల్ రూమ్ నుండి పెద్దపల్లి రైల్వే స్టేషన్ మేనేజర్ సమాచారం ఇవ్వడంతో పెద్దపల్లిలో ట్రైన్ నిలిపివేశారు రైల్వే అధికారులు. రైల్వే స్టేషన్ నుండి 108 అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే నొప్పులు ఎక్కువ కావడంతో అనిత అంబులెన్స్ సిబ్బందితో సహాయంతో అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి మాత శిశు హాస్పిటల్‌కు తరలించారు. గర్భిణికి పురుడు పోసిన సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.