Women Misbehavior : ఆకాసా ఎయిర్ విమానంలో ముంబై (Mumbai) కి వెళ్తున్న సమయంలో సిబ్బందితో, అలాగే ఇతర ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, గందరగోళం సృష్టించడం వంటి కారణాలతో ఓ మహిళ వీరంగం సృష్టించింది. లక్నో (Lucknow) లో విమానంలోకి బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళ భద్రతా సిబ్బంది చేతిని కొరికింది.
Highest Paid Actress : టాప్ ప్లేస్ లోకి దీపికా పదుకొనే, టాప్ 10 జాబితా ఇదే !
ఈ విషయం సంబంధించి.. లక్నో జాయింట్ పోలీస్ కమీషనర్ ఆకాష్ కుల్హరి తెలిపిన వివరాల ప్రకారం., మహిళ మానసిక పరిస్థితి బాగా లేదని, దాంతో ఆమె విమానంలో ఇతర ప్రయాణికులతో గొడవ పడినట్లు తెలిపారు. ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అనంతరం మహిళ ప్రయాణికురాలిని విమాన సిబ్బంది కిందకు దించారని తెలిపారు. అయితే, ఆ సమయంలో ఆమె బయటకు వెళ్లేందుకు నిరాకరించి, బలవంతంగా విమానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసింది. సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, మహిళ అతనితో కూడా గొడవపడి అతని చేతిని కొరికింది.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాయకీయాల్లో ట్విస్ట్.. బీజేపీ ఎంపీని కలిసిన సీఎం మమతా బెనర్జీ
దింతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమెను ఎయిర్ లైన్స్ మహిళ ఉద్యోగులు వారికి అప్పగించారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా శాంతి, ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా రెచ్చగొట్టడం) కింద కేసు నమోదు చేసారు. అయితే మహిళ మానసిక పరిస్థితి అస్థిరంగా ఉందా లేదా అనేది వైద్య పరీక్షల తర్వాతే తేలిపోతుందని లక్నో జాయింట్ సీపీ కుల్హారీ తెలిపారు.