NTV Telugu Site icon

Drinking Water: ఆ మహిళకు నీళ్లు తాగితే ప్రాణానికే ప్రమాదం..!

Drink Water

Drink Water

ఏదైనా ఆహారం, పానీయాలు తినే అంత తింటేనే ఆరోగ్యం. మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కానీ కొందరు తిండి విషయంలో సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత దాని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు త్రాగాలని తరచుగా చెబుతుంటారు. అయితే నీరు ఎక్కువ త్రాగడం కూడా ప్రాణాంతకం అని మీకు తెలుసా?.. అయితే ఓ మహిళ.. నీరు ఎక్కువ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ వార్త చర్చనీయాంశమైంది.

ఆ మహిళ పేరు మిచెల్ ఫెయిర్‌బర్న్. కెనడా నివాసి అయిన మిచెల్ టిక్‌టాక్ లో చాలా ఫేమస్. అయితే సోషల్ మీడియాలో 75 హార్డ్ అంటూ ఓ ఛాలెంజ్ నడుస్తోంది. మిచెల్ ఈ ఛాలెంజ్‌ని తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వదులుకున్నారు. తన పరిస్థితి విషమించి చనిపోయేంతగా తయారైంది. అయితే.. చాలా శ్రమించిన వైద్యులు.. తన ప్రాణాలను కాపాడారు.

Nirmala Sitharaman: ప్రతిపక్షాలది మొసలి కన్నీరు.. మణిపూర్‌ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి

75 హార్డ్ ఛాలెంజ్ అంటే ఏమిటి?
ఈ ఛాలెంజ్‌ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని చేసే వ్యక్తి ఉదయాన్నే నిద్రలేవాలి, వ్యాయామం చేయాలి, బయటి ఆహారం తినకూడదు, మద్యం మానేయాలి మరియు రోజూ 10 నిమిషాలు ఏదో ఒక పుస్తకాన్ని చదవాలి. ఈ ఛాలెంజ్‌లోని విచిత్రం ఏమిటంటే.. ప్రతిరోజూ తాగే నీటి పరిమాణాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజూ సోషల్ మీడియాలో తమ ఫొటోలను షేర్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ని ఫాలో అయిన మిచెల్.. వరుసగా 12 రోజులు 4-4 లీటర్ల నీరు తాగింది. ఆ తర్వాత తన ఆరోగ్యం క్షీణించింది.

Hyderabad Metro Expansion: హైదరాబాద్‌ మెట్రోపై కీలక నిర్ణయం.. అక్కడి వరకు మెట్రో సేవలు

నీరు త్రాగడం వల్ల ఈ తీవ్రమైన వ్యాధి వస్తుంది
మిచెల్‌ మళ్లీ డాక్టర్‌ని సంప్రదించినప్పుడు తనకి సోడియం లోపం అనే వ్యాధి ఉందని తేలింది. రోజూ 4 లీటర్ల నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సోకిందని వైద్యులు తెలిపారు. తర్వాత ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు వైద్యులు ప్రతిరోజూ అరలీటర్ కంటే తక్కువ నీరు తాగాలని చెప్పారు. శరీరం లోపల సోడియం లోపం ప్రమాదకరమైన వ్యాధి అని తెలిపారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అని డాక్టర్లు సూచించారు.

Show comments