Site icon NTV Telugu

Madhya Pradesh: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన భార్య

murder

murder

Madhya Pradesh: ఏమిటో తెలియని గానీ ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అగ్నిసాక్షిగా కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు. ఇలాంటి నేరపూరిత కుట్రలో మహిళలు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన హత్య ఘటనలో ఓ మహిళ తన భర్తను దారుణంగా హతమార్చేందుకు కుట్ర పన్నింది. తన వివాహేతర సంబంధాలకు భర్త అడ్డుగా నిలిచాడు. దీంతో మహిళ తన ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ మహిళ, తనకు సహకరించిన ప్రియుడితో పాటు మరో యువకుడిని అదుపులో తీసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.

Read Also:Priyanka Gandhi: జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం

జావేద్ అనే యువకుడు వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న చందన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత హత్యకు గురైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. జావేద్ కుటుంబీకులు సద్దాం అనే యువకుడిని అనుమానించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సద్దాంను అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. మొదట్లో పోలీసుల ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. తప్పుదోవ పట్టించే సమాధానాలు చెప్పాడు. అయితే పోలీసులు తన ఖాకీ బ్యాడ్జీని చూపించిన వెంటనే సద్దాం జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలోనే జావేద్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు.

Read Also: Check Seat Availability In Train: రైలులో సీట్ లభ్యతను ఎలా తెలుసుకోవాలి?

జావేద్ భార్య సాయంతో ఈ కుట్ర పన్నినట్లు సద్దాం పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు జావేద్ భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో భర్త వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే హత్య చేసినట్లు అంగీకరించింది. సద్దాం, షకీర్, జావేద్ భార్య రుక్సానా సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కోర్టు వారిని జైలుకు పంపింది.

సద్దాం, రుక్సానా ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ ఒకే కాలనీలో నివసించేవారు. సద్దాం రిక్షా నడిపేవాడు. రుక్సానాతో ప్రేమలో ఉన్నాడు. రుక్సానా అభ్యర్థన మేరకు, అతను జావేద్‌ను తాగడానికి ఆహ్వానించాడు. జావేద్ తాగి రిక్షాలోనే చంపబడ్డాడు. ఆ తర్వాత జావేద్ మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో పడేశారు.

Exit mobile version