NTV Telugu Site icon

Viral Video: వీధిలో నడుస్తుండగా.. మహిళపై పడిన వాటర్‌ ట్యాంక్! అదృష్టం అంటే ఇదేమరి

Water Tank Women

Water Tank Women

Water Tank Falls On Women: ‘ఆవగింజంత అదృష్టం’ ఉన్నా.. ప్రాణాలతో బయటపడొచ్చన్న ఓ సామెత ఉంది. ఆ ఆవగింజంత అదృష్టంతో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవచ్చు. ఓ మహిళ విషయంలో అక్షరాలా ఇదే జరిగింది. వీధిలో నడుస్తున్న ఓ మహిళపై పెద్ద వాటర్‌ ట్యాంక్‌ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంత పెద్ద ట్యాంక్‌ పడినా.. ఆమె ఒంటిపై చిన్న గీత కూడా పడకపోవడం విశేషం. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలుస్తోంది.

వీడియో ప్రకారం… ఓ మహిళ తన ఇంటి ముందున్న మరో మహిళతో మాట్లాడుతూ.. చక్కగా యాపిల్‌ పండు తింటోంది. మాట్లాడిన అనంతరం ఆమె రోడ్డుపై నడుచుకుంటూ.. తన ఇంటికి వెళ్తుంటుంది. వీధిలో నడుస్తుండగా.. హఠాత్తుగా ఓ భారీ వాటర్‌ ట్యాంక్‌ ఆమెపై పడుతుంది. మనిషి ఎత్తు అంత ఉన్న ఆ ట్యాంక్‌ లోపల ఆమె చిక్కుకున్నది. అయితే ట్యాంక్‌ అడుగు భాగంలో రంధ్రం ఉండడంతో ఆ మహిళ బతికిపోయింది. సరిగ్గా ట్యాంక్‌ అడుగు భాగంలో ఉన్న రంధ్రం మధ్యలో ఆమె పడుతుంది. అదృష్టవశాత్తు ఆ మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు.

Also Read: Naga Chaitanya: నాగ చైతన్యపై రూమర్‌.. స్పందించిన టీమ్!

ఈ ఘటన చూసి 2-3 వ్యక్తులు పరుగున ఆ మహిళ వద్దకు వస్తారు. వాటర్‌ ట్యాంక్‌ పడిన ఎదురింటి వారిపై అసహనం వ్యక్తం చేస్తారు. ఈ సంఘటనకు సంబందించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 1.4 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ ఘటనపై కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేశారు. ‘అదృష్టం అంటే ఇదేమరి’, ‘రోజుకో యాపిల్‌ తినండి.. డాక్టర్‌కు దూరంగా ఉండండి’ అంటూ కామెంట్స్ పెట్టారు.

Show comments