దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుని, అక్కడ జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారు. సీఎం గా రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించడం ఇది మొదటిసారి. ఆయన కొండారెడ్డిపల్లిలో రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించబడిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్న ప్రారంభించనున్నారు. ప్రధాన భవనం ముందు మామిడి మొక్కను నాటారు. రూ. 18 కోట్లతో చేపట్టనున్న గర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
Pendrive: టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం!
సీఎం రేవంత్ రెడ్డి రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఫైలెట్ ప్రాజెక్ట్ కింద 3kw కెపాసిటీ సౌర విద్యుత్తును ప్రారంభించారు. అలాగే.. రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించనున్న చిల్డ్రన్స్ పార్క్, బహిరంగ వ్యాయామశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. రూ. 64 లక్షలతో చేపట్టనున్న బస్ షెల్టర్, విద్యుత్ దీపాలంకరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన గ్రామస్తులకి సానుభూతి తెలిపి, అభివృద్ధి ప్రణాళికలు పంచుకున్నారు.
Pendrive: టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం!