NTV Telugu Site icon

Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్‌మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..

Train

Train

ఒక్కోసారి చాలామంది రైలు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే జనరల్‌ బోగీల్లో ప్రయాణం చేయలేక.. రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్స్ లోకి వెళ్లి ప్రయాణం చేస్తారు. అయితే ఇందులో చాలామంది కాస్త ఫైన్‌ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయతన్నం చేస్తారు. ఇకపోతే ఏసీ కంపార్ట్‌మెంట్స్ లో మాత్రం కాస్త కచ్చితంగా నిబంధనలను పాటిస్తారు అధికారులు. ముఖ్యంగా రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ కాని వారిని, అలాగే టికెట్‌ లేనివారందరిని ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బయటకు పంపేస్తారు.

Lok Sabha Election Phase 6: ఆరో విడత లోక్‌సభ ఎన్నికల్లో 57.7 శాతం పోలింగ్ నమోదు..

ఇకపోతే తాజాగా, బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌ లో ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ రోజు రైలు పరిస్థితికి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఏసీ కంపార్ట్మెంట్‌, జనరల్‌ బోగీ కంటే దారుణంగా ఉంది. ఇక ఏసీ రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ కానివారు, వారితోపాటు అసలు టికెట్‌ తీసుకోనివారు కూడా ఆ బోగిలోకి వచ్చేయడంతో థర్డ్‌ ఏసీ బోగీ కాస్తా సంత మార్కెట్‌ లా కనపడుతోంది.

CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..

బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌కి విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి థర్డ్‌ ఏసీ కంపార్ట్‌మెంట్లో మొత్తం 8 టికెట్లు బుక్‌ చేశారు. అందుకోసం పట్నా స్టేషన్‌ లో రైలు ఎక్కగానే వారి కుటుంబానికి విచిత్ర సంఘటన ఎదురైంది. వారు వచ్చే లోపే బోగీలోని సీట్లన్నీ నిండిపోయి. బోగీ మొత్తం జనం కిక్కిరిసిపోయారు. వారి సీట్స్ లో కూర్చున్న వారికి రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ అయ్యిందని చెప్పినా ఎవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరని., ఆ సమయంలో సాయం కోరేందుకు ఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో లేదంటూ వాపోయాడు. ఇక చివరికి ఎలాగో ప్రయత్నించి ఆయన 6 సీట్లు దక్కించుకున్నారు. ఇక అక్కడి పరిస్థితిని వీడియో తీసి ఎక్స్‌ లో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్త అది వైరల్‌గా మారింది.