NTV Telugu Site icon

Constable Bribe: లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కానిస్టేబుల్‌.. ఈడ్చుకెళ్లిన విజిలెన్స్ బృందం..

Constable Bribe

Constable Bribe

Constable Bribe Viral Video: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రములోని కాన్పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా.. విజిలెన్స్ బృందం అతన్ని పట్టుకుని, చెప్పులు లేకుండా పోలీసు కార్యాలయానికి ఈడ్చుకెళ్లింది. హెడ్ ​​కానిస్టేబుల్‌ను షానవాజ్ ఖాన్‌గా గుర్తించారు. దళితుల అణచివేత కేసులో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అతనిని అరెస్టు చేశారు. షానవాజ్‌ ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. విషయంపై విచారణ జరుగుతోంది.

High Tension in Vizag: స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన.. విశాఖలో టెన్షన్ టెన్షన్‌..

దక్షిణ కాన్పూర్‌ లోని జుహీలో నివసిస్తున్న రింకూ జూలై 15న కిద్వాయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నలుగురు వ్యక్తులపై షెడ్యూల్డ్ కులాలు, తెగల చట్టం కింద కేసు నమోదు చేసింది. అదనపు పోలీసు కమిషనర్‌ అమర్‌ నాథ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇక్కడే రింకూ షానవాజ్‌ ను కలిశాడు. షానవాజ్ రూ. 20,000కి త్వరిత చర్య గురించి మాట్లాడాడు. అయితే రూ. 15,000కి డీల్ ఖరారు అయింది. దీనిపై రింకూ విజిలెన్స్‌ కు ఫిర్యాదు చేసాడు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కానిస్టేబుల్‌ ను రోడ్డుపై లాకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments