రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆకలేస్తే, రోడ్డు పక్కన ఆగి వంట చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ రన్నింగ్ లో ఉన్న కారులో వంటలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. అది తప్పు అని ఓ అమ్మాయి నిరూపించింది.. కారులో గుమ గుమలాడే చికెన్ ఫ్రైని చేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్‌ని కబాబ్ ముక్కలుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత ఓ చిన్న కవర్ తీసుకుని అందులో కబాబ్ కు కావాల్సిన మసాలాలను వేసింది.. ఒకసారి అందులో ముంచి మళ్లీ వేరే సంచిలో ముంచింది.. ఆ తర్వాత ఒక ఛార్జింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వెడయ్యాక అందులో డీ ఫ్రై చేస్తుంది.. అంతే చిటికెలో వేడి వేడి చికెన్ ను తయారు చేస్తుంది..
కారులో వెళ్తు ఇలా చిటికెలో వంటను చేసుకోవడం తెలియక చాలా మంది బయట రెస్టారెంట్ లలో తింటున్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఎలా చేసిందో ఒక్కసారి చూసేయ్యండి.. ఈమె తెలివితేటలకు మెచ్చుకోవాల్సిందే.