Site icon NTV Telugu

Heart Attack : దుమ్ము లేచేలా డ్యాన్స్ చేశాడు.. దమ్ము ఆడక చనిపోయాడు

Heart Attack

Heart Attack

Heart Attack : చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్య చాలా మంది గుండెపోటుతో తనువు చాలిస్తున్నారు. ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చనిపోయాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అంతకు ముందు ఓ వ్యక్తి పెళ్లి లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.

Read Also:The Kerala Story: వివాదాస్పదం అంటూనే వంద కోట్లు ఇచ్చారు…

తాజాగా మరో గుండె పోటు మరణం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వ్యక్తి తన మేనకోడలు పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇతరలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత కూర్చున్నాడు, కూర్చున్న చోటే ఉన్నట్టుండి కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్నవారు అతన వద్దకు వచ్చినట్లు వీడియోల కనిపిస్తోంది. ఆతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.

Read Also:Ice apple: చల్లచల్లగా తాటిముంజల్‌.. మండుటెండలో మాంచి ఉపశమనం

మృతుడు రాష్ట్రంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న బలోద్ జిల్లాకు చెందిన దిలీప్ రౌజ్‌కర్‌గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో ఓ పెళ్లికి వెళ్లాడు. మే 4, 5 మధ్య రాత్రి రౌజ్కర్ తన మేనకోడలు పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. డ్యాన్స్ చేస్తుండగా, హఠాత్తుగా విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుని, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మొత్తం పెళ్లి వీడియోలో రికార్డు అయింది.

Exit mobile version