సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం జనాలు ఎంతటిదానికైనా తెగిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. కొన్ని ప్రమాదకర వీడియోలను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటివి రకరకాల వీడియోలను చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఢిల్లీ మెట్రోలో ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కూడా ఓ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా మెట్రోలో చేసిందే.. ఇంతకీ అది ఎక్కడంటే.
Read Also: Mumbai: అపార్ట్‌మెంట్‌లో మహిళా ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య
అత్యధిక వివాదాల్లో నిలిచిన ఢిల్లీ మెట్రో పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువగా ఢిల్లీ మెట్రోలో చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా చేసిన వీడియో.. నాగ్‌పూర్ మెట్రోలో. ఇప్పుడు ఢిల్లీ వైరస్ ఇక్కడికి కూడా చేరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విషయానికొస్తే.. మెట్రోలో కొందరు అమ్మాయిలు ఫ్యాషన్ షో నిర్వహించారు. డిజైనర్ దుస్తులు ధరించిన మహిళల బృందం మెట్రో లోపల ర్యాంప్ వాక్ చేశారు.
Read Also: France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్..
ఈ వీడియోలో వివిధ డ్రెస్‌లు ధరించిన మహిళలు ర్యాంప్‌పై నడుస్తున్నట్లుగా మెట్రో ఫ్లోర్‌పై నడుస్తున్నట్లు చూడవచ్చు. ఈ సీన్‌ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటే, షూట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో nagpur_xfactor_ అనే పేరుతో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికీ రెండు లక్షల మందికి పైగా లైక్స్ రాగా, కోట్లాది మంది చూశారు.