Site icon NTV Telugu

New Couple On Bulldozer: బుల్డోజర్ పై ఊరంతా ఊరేగిన నవ దంపతులు..

Buldozer

Buldozer

New Couple On Bulldozer: ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వ్యవహారాలలో కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు ప్రజలు. పెళ్లి కార్యక్రమాలకు వారు తహతకు మించి కొందరు ఖర్చు చేస్తూ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లి కార్డు ఇన్విటేషన్ నుండి పెళ్లి అయ్యాక బంధువులు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటన్ గిఫ్ట్స్ వరకు ఎన్నో పనులను కార్యక్రమాలను వెరైటీగా ఉండాలంటూ తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వెర్రి వెయ్యి విధాలు అన్నట్లుగా కొత్త కొత్త ఆలోచనలతో కొత్తగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉండడంతో.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ వివాహ వేడుక సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Kurnool: ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ వ్యక్తి తన వివాహ వేడుకల కోసం కాస్త వింత ప్రయత్నం చేశాడు. తన పెళ్లి వార్తల్లో నిలవాలని ఆలోచించాడేమో ఏమో తెలియదు కానీ.. కృష్ణ వర్మ అనే యువకుడు తన వివాహం జరిగిన తర్వాత నూతన వధువుతో కలిసి తన ఇంటికి వచ్చే సమయంలో బుల్డోజర్ ఎక్కి ఊరంతా తిరిగి చివరికి ఇంటికి చేరాడు. ఇది చూసిన ఊరు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇకపోతే., యూపీలో బుల్లోజర్లకు కాస్త ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి కారణం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏదైనా ప్రసంగాల సమయంలో రాజకీయ ప్రత్యర్థులను బుల్డోజర్ తో వారి ఇళ్లను కూల్చేస్తానని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారి చేస్తుండగా ఇవి మరింత ప్రాముఖ్యం చెందాయి.

Kalki 2898 AD OTT: ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డే రోజు నుంచి స్ట్రీమింగ్!

Exit mobile version