Site icon NTV Telugu

Surat: విషాదం.. 7వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి

Surat

Surat

గుజరాత్‌లోని సూరత్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఏడో అంతస్తులోని ఫ్లాట్‌లోని బాల్కనీలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కుటుంబసభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Read Also: Viral video: ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. అవాక్కైన ప్రయాణికులు

వివరాల్లోకి వెళ్తే.. పాల్ ప్రాంతంలోని శ్రీపాద్ సెలబ్రేషన్స్ అనే రెసిడెన్షియల్ భవనంలోని ఏడవ అంతస్తులో హౌస్ కీపింగ్ పని చేస్తున్న మహిళ.. తన కొడుకును వెంట తీసుకొచ్చింది. మహిళ నిమగ్నమై ఉండగా పిల్లవాడు ఉన్నట్టుండి.. ఫ్లాట్‌లోని బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీలో ఉన్న గ్రిల్‌తో ఆడుకుంటూ.. ముందుగా తన రెండు కాళ్లను బయట పెట్టాడు.

Read Also: NEET Result 2024: ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్ లో 705 మార్కులు

ఆ తర్వాత, అలానే నెమ్మదిగా తన శరీరాన్ని పూర్తిగా గ్రిల్ నుండి బయటికి తీశాడు. చేతులతో గ్రిల్ పట్టుకున్నప్పటికీ.. చిన్నారి రెండు చేతులు వదిలేయడంతో ఏడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. ఈ దృశ్యాలు ఫ్లాట్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. ఇంతకుముందు.. సూరత్‌లోని పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాస భవనం యొక్క పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న అమ్మాయి నుంచి కారు వెళ్లడంతో.. అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలు పార్కింగ్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.

Exit mobile version