Governor Tamilisai : ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపిన గవర్నర్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ట్వీట్ ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపింది. మల్లిగారి సంధ్యారాణి అనే మహిళ.. తన కుటుంబ దుస్థితిని వివరిస్తూ గురువారం గవర్నర్ తమిళిసై కు ట్వీట్ చేశారు. గురువారం భైరాన్‌పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిద్దిపేటలోని చేర్యాల వద్ద ఆమె గవర్నర్ కాన్వాయ్‌ను ఆపి నిరసన చేపట్టారు. సంధ్య కాన్వాయ్‌ను ఆపడంతో, గవర్నర్, భద్రతా సిబ్బంది భద్రతా కారణాల దృష్ట్యా ఆందోళన తెలిపినా పట్టించుకోకుండా, కారు దిగి ఆమె ఇంటిని సందర్శించారు. తన ముగ్గురు కూతుళ్లతో కలిసి శిథిలమైన ఇంట్లో ఉన్న సంధ్య దీనస్థితిని చూసి గవర్నర్ చలించిపోయారు. తనకు ఇల్లు మంజూరు కాలేదని, శిథిలావస్థలో ఉన్న ఇంటిలో కుటుంబంతో కలిసి ఉండడం ఇబ్బందిగా ఉందని సంధ్య గవర్నర్‌ను అభ్యర్థించింది. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన గవర్నర్, రాజ్ భవన్ నుంచి ఆమెకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: CM KCR : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సీఎం కేసీఆర్
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
సంధ్య కుటుంబం దుస్థితి గురించి గవర్నర్ ట్వీట్ చేయడంతో భారత్ బయోటెక్‌కు చెందిన సుచిత్రా ఎల్లా స్పందించారు. సంధ్య పిల్లల చదువుకు మద్దతు ఇవ్వడానికి సుచిత్రా ఎల్లా సుముఖత వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీ క్యాంపస్‌లో సంధ్యకు తగిన ఉద్యోగం ఇస్తానని తెలిపారు. ఆమె కుటుంబానికి సహాయం చేయటానికి ముందుకు వచ్చిన సుచిత్రా ఎల్లా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తు, గవర్నర్ సుచిత్రా ఎల్లా మానవతా దృక్పథాన్ని, మంచి మనస్సును, పరోపకార గుణాన్ని మెచ్చుకున్నారు. సంధ్య, ఆమె కుటుంబానికి సహాయం అందించటంలో రాజ్ భవన్ అధికారులు భారత్ బయోటెక్‌తో సమన్వయం చేసుకుంటారు.
So Nice of https://t.co/EIIYnCfXA3 office will share her details.I am sure your humanitarian approach will bring smile on her face.I thank you from the bottom of my heart as her agonised face boldly coming infront of my car was much disturbing me. 🙏@BharatBiotech solving it https://t.co/eFzbiUhcGm
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 11, 2022
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!