Throat Cut: దారుణ హత్యలు, మనషులపై దాడులు భాగ్యనగరంలో జరుగుతున్న ఘటనలకు హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. క్షణాల్లో ఏం జరుగుతుందో అంటూ బయటకు రావడానికి నగరవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు నార్సింగీలో దారుణం చోటుచేసుకుంది. మెకన్ గడ్డ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు దుండగులు. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు నార్సింగీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read also: Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
హుటాహుటిన ఘననా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఏర్పాటు చేశారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు స్వేకరిస్తున్న పోలీసులు. ఘటనా స్థలంలో ఉన్న సీ.సీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది? ముందే చంపి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా? లేక ఈప్రాంతంలోనే తీసుకువచ్చి హత్యచేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ప్రదేశం నిర్మాణుష్యంగా ఉండటంతోనే ఇక్కడ తీసుకువచ్చి చంపేశారా? వీరిద్దరికి మధ్య ఇంతకు ముందే ఏమైన తగాదాలు ఉన్నాయా? అలా ఉన్నందుకే ఈఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Aamir Khan: రెండు ఫ్లాపులకే ఇలా అయిపోయాడు ఏంటి?