హీరో అనగానే మంచి ఫిజిక్ మైంటైన్ చేయాలి, ఎప్పుడూ మేకప్ లో ఉండాలి, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో కనిపించాలి, గడ్డంపై రకరకాల ప్రయోగాలు చేయాలి, మోస్ట్ ట్రెండీ అవుట్ ఫిట్స్ వేసుకోవాలి, వయసు తెలియకుండా కాపాడుకోవాలి, ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా స్టైల్ ఐకాన్ లా కనిపించాలి. అప్పుడే ఆ హీరో ఫోటోలు అభిమానులకి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ప్రతి హీరో కథ ఇదే అయితే ఒక్క హీరో మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించి అందరికీ షాక్ ఇస్తున్నాడు. తన ఫాన్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్న ఆ స్టార్ హీరో బాలీవుడ్ సూపర్ స్టార్ ‘ఆమిర్ ఖాన్’.
ఆమిర్ ఖాన్ అనగానే ఇప్పటికీ కుర్రాడిలా కనిపించే హీరో గుర్తొస్తాడు. 57 ఏళ్ల వయసులో కూడా యూత్ హీరోస్ కి పోటి ఇవ్వగలడు ఆమిర్ ఖాన్. కాలేజ్ స్టూడెంట్ గా కూడా నటించి మెప్పించగల ఈ సీనియర్ హీరో లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లగడ్డం, నెరిసిన జుట్టుతో ఆమిర్ ఖాన్ ఫోటోలో బయటకి రావడంతో… ఇదా ఆమిర్ ఖాన్ అసలు రూపం అంటూ ఆశ్చర్యపోతున్నారు. తన కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలో కూడా ఆమిర్ ఖాన్ ఇలానే ఓల్డ్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అదే ఓల్డ్ లుక్ లో తన కొత్త ఆఫీస్ ఓపెనింగ్ లో ‘కలశ పూజ’ చేశాడు ఆమిర్ ఖాన్. ఈ ఫోటోలు చూసిన ఆమిర్ ఖాన్, అంతటి స్టార్ హీరో అయ్యి ఉండి ఇలా బయటకి రావడం గ్రేట్ అంటుంటే మరికొంత మంది ఏమో రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యే సరికి ఆమిర్ ఇలా అయిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి రికార్డులని కూడా బీట్ చేసిన ఆమిర్ ఖాన్ కి బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ఫ్లాప్స్ వచ్చాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దీంతో గత అయిదేళ్లలో ఆమిర్ ఖాన్ ఖాతాలో హిట్ అనేదే లేకుండా పోయింది. తన నెక్స్ట్ సినిమాతో అయిన ఆమిర్ ఖాన్ హిట్ ఇచ్చి సక్సస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.