పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. కాశ్మీర్, కోల్‌కతా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టు జరిగింది. ఆదివారం అనుమానిత ఉగ్రవాదిని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల డిమాండ్ మేరకు కాశ్మీర్‌లోని నిషేధిత ‘తెహ్రీక్-ఎ-ముజాహిదీన్’ సంస్థకు చెందిన అనుమానిత సభ్యుడు జావేద్ మున్షీని డిసెంబర్ 31 వరకు ట్రాన్సిట్ రిమాండ్‌కు కోర్టు పంపింది.
READ MORE: Ambedkar remark: “అంబేద్కర్ వ్యాఖ్యల”పై అమిత్ షాకి వ్యతిరేకంగా డీఎంకే తీర్మానం..
అనుమానిత ఉగ్రవాదిని కానింగ్‌లోని అతని బంధువుల ఇంట్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ నిందితుడి పేరు జావేద్ మున్షీ. ప్రస్తుతం కాశ్మీర్‌లో పాకిస్థాన్ మద్దతుతో ఉన్న టెహ్రీక్-ఎ-ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉంది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల వాంటెడ్ లిస్టులో ఈ నిందితుడి పేరు కూడా ఉంది. జావేద్ ఉగ్రవాద కార్యకలాపాలు లోయ నుంచే నడుపుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
READ MORE: Hyderabad: సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సంచలన వీడియో విడుదల..
శ్రీనగర్‌కు చెందిన జావేద్ బెంగాల్‌కు వస్తున్నాడని కశ్మీర్ పోలీసులకు రహస్య వర్గాల నుంచి సమాచారం అందింది. జావేద్ ను పట్టుకునేందుకు ఇదే సరైన సమయమని పోలీసులు భావించారు. కశ్మీర్ పోలీసులు శాటిలైట్ లొకేషన్ ద్వారా జావేద్‌ను కాశ్మీర్ నుంచి నేరుగా బెంగాల్‌లోని క్యానింగ్ వరకు ఛేజ్ చేశారు. అనంతరం కోల్‌కతా పోలీసులను సంప్రదించారు. దీంతో కోల్‌కతా బలగాలు జావేద్‌ను కనిపెట్టేందుకు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. దిగ్విజయంగా నిందితుడిని పట్టుకున్నారు. అయితే.. జావేద్ బెంగాల్‌కు ఏ ప్రయోజనం కోసం వచ్చాడు? దీనికి సంబంధించి ఇప్పటికీ చాలా గందరగోళ ప్రశ్నలు వస్తున్నాయి.