ఈ మధ్యకాలంలో చాలామంది వారి క్రియేటివిటీ ఉపయోగించి పలు రకాల ఫన్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి మీమ్స్ క్రియేట్ చేయడం అంటే అంత సులువు కాదు అదొక ఆర్ట్. ఇదివరకు కేవలం ఫన్ క్రియేట్ చేయడం కోసం వీటిని వాడుతుండగా.. ప్రస్తుతం వీటి కోసం కంటెంట్ క్రియేటర్లు అంటూ కొత్తగా తెరమీదకి కూడా వచ్చారు. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ఫన్నీ వీడియోలు అంటూ తరచుగా అనేకం హల్చల్ చేస్తున్నాయి. ఇక మరోవైపు విద్యార్థులకు పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయమంటే.. వారు వారి తెలివితేటలు ఉపయోగించి రకరకాల ఫన్నీ ఆన్సర్స్ రాస్తూ వైరల్ అవుతున్నారు. ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఏదో ఒకటి రాసి పేపర్ నింపాలన్న భావనతో చిత్ర విచిత్రమైన సమాధానాలు రాయడంతో అందుకు సంబంధించిన కొన్ని పరీక్ష పత్రాలు టీచర్లు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో చాలానే వైరల్ అయ్యాయి.
Leech Found In Nose: మనిషి ముక్కులో “జలగ”.. అరుదైన శస్త్రచికిత్స..
ఇక ప్రస్తుతం ఇలాంటి వర్షం సమాధానాలు క్వశ్చన్ పేపర్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లో మూడు ప్రశ్నలు అడగగా.. వాటికి ఓ స్టూడెంట్ కళ్ళు తెరిపించే సమాధానాలు ఇచ్చాడు. అందులో మొదటి రెండు ప్రశ్నలు ఒక ఎత్తైతే., చివరిగా ఉన్న మూడో ప్రశ్నలో సమాధానం మాత్రం పీక్స్ అంతే. ఇక ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఒకసారి చూస్తే..
1వ ప్రశ్నలో భూమి గుండ్రంగా ఉంటుందని ప్రూవ్ చేయగలరా అని అడిగారు. అందుకు గాను ” నేను చేయలేను., ఎందుకంటే.. భూమి గుండ్రంగా ఉంటుందని నేను చెప్పలేదు ” అంటూ సమాధానము ఇచ్చాడు. ఇక రెండో ప్రశ్నగా.. మనకు సూర్యుడు, చంద్రుడు.. వీరిలో ఎవరు ముఖ్యం అని అడిగారు. దానికి సమాధానంగా చంద్రుడు.. ఎందుకంటే రాత్రి చీకటిలోనూ చంద్రుడు మనకు వెలుగునిస్తాడు. సూర్యుడు పగటిపూట మాత్రమే కాంతిని ఇస్తాడు. కాకపోతే మనకు అది అవసరముండదని సమాధానము ఇచ్చాడు. ఇక చివరి మూడో ప్రశ్నలో మూడు ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్స్ ఏంటి అని అడగగా దానికి a) టెలిఫోన్, b) ఇంటర్నెట్, c) వుమన్ అంటూ సంధానం ఇచ్చాడు. వీటిలో చివరిగా ” వుమన్ ” అన్న దానిపై చాలా మంది స్పందించారు.