NTV Telugu Site icon

Vizag: రుషికొండ బీచ్ లో విషాదం.. యువకుడు మృతదేహం లభ్యం

Vizag

Vizag

విశాఖ పట్నంలోని రుషికొండ బీచ్ లో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం అయింది. స్నేహితులతో సరదాగా గడిపేందుకు రుషికొండ బీచ్‌కు వచ్చిన యువకుడు నిన్న గల్లంతయ్యాడు. కంచరపాలెం ఊర్వశి జంక్షన్‌కు చెందిన తేజ గురువారం నాడు సాయంత్రం తన (ఇంటర్‌) స్నేహితులు జి.సృజన్‌, జి.హర్ష, వంశీ, సాయి వెంకట్‌, ప్రణీత్‌లతో కలసి రుషికొండ బీచ్‌కు వచ్చాడు. బీచ్‌లో సుమారు 3 గంటల పాటు సరదాగా గడిపి ఫొటోలు తీసుకున్నారు. గత రాత్రి 7 గంటల సమయంలో ఈ ఆరుగురు స్నేహితులు రుషికొండ బీచ్‌కు కాస్త దూరం వెళ్లి స్నానాలకు దిగారు.

Read Also: Elections 2024: విజయనగరం జిల్లాలో ప‌ర్యటించిన రాష్ట్ర‌ ఎన్నిక‌ల అధికారులు..!

ఈ క్రమంలో పెద్ద కెరటం ఒక్కసారిగా రావడంతో తేజ సముద్రంలోకి కొట్టుకు పోయాడు. అతడ్ని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించి.. పెద్దగా కేకలు వేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇది గమనించిన లైఫ్‌ గార్డ్స్‌ ఘటనా సంఘటన స్థలానికి చేరుకుని గాలించినప్పటికీ తేజ ఆచూకీ లభ్యం కాలేదు.. తేజ అమరావతి విట్స్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం ఈసీఈ అభ్యసిస్తున్నాడు. తండ్రి కేఎల్‌ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు సంఘటన ప్రదేశానికి వచ్చారు. తేజ మృతదేహాన్ని చూసి వారు కన్నీటిపర్యాంతమయ్యారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.