Site icon NTV Telugu

Student Suside: అతిగా ఫోన్ చూస్తుందని కూతుర్ని మందలించిన తండ్రి.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని

Student Suside

Student Suside

ప్రస్తుత కాలంలో ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. అలాంటిది.. ఆ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేరు. ఇక తాజాగా, అతిగా ఫోన్ చేస్తుందని తండ్రి కూతురు మందలించినందుకు మనస్థాపానికి లోనై పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామంలో జరిగింది. పగిడాల గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి ఎక్కువగా ఫోన్ చూస్తుందని గ్రహించిన తండ్రి ఈనెల 20వ తేదీన కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదువుపై దృష్టి పెట్టాలని తరచూ ఫోన్ చూస్తూ ఉంటే ఎలా చదువుతావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Read Also: Allu Arjun: పుష్ప 2 కోసం బన్నీ తీసుకున్న రెమ్యూనిరేషన్.. దేవుడా అన్ని కోట్లా.. ?

దీంతో పదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు మెరుగైన చికిత్స అందించాలని విద్యార్థి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు వారు వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోయారు. దీంతో అక్కడే చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందింది. మృతదేహాన్ని తిరిగి తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు.. అనంతరం విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అరవింద్ అన్నారు.

Read Also: Lemon Water: నిమ్మరసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి తెలుసా..!

Exit mobile version