ఒక్క హిట్ కొడితే అరడజన్ ప్లాపులివ్వడం మ్యాచో స్టార్‌కు అలవాటైంది. సాలిడ్ కంబ్యాక్ ఎప్పుడిస్తావన్నా అంటూ ఫ్యాన్స్ కూడా అడగడంతో కాస్త గ్యాప్ తీసుకుని స్టోరీలపై ఫోకస్ చేశాడు. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. ఎస్వీసీసీ బ్యానర్‌పై ఓ మూవీతో పాటు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ హౌస్‌లో గోపీచంద్ 33 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
Also Read : RT77 : రవితేజ – శివనిర్వాణ – మైత్రి మూవీస్.. టైటిల్ “ఇరుముడి”
ఘాజీతో ఫ్రూవ్ చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ 33 మార్చిలోనే స్టార్టైంది. ఇందులో సరికొత్త గోపీని చూపించబోతున్నాడట సంకల్ప్ రెడ్డి. పీరియాడిక్ మూవీగా రాబోతోందని తెలుస్తోంది. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు సంకల్స్ రెడ్డి. బర్త్ డేకు గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యేలా చేశాడు. కానీ అక్కడ నుండి నో అప్డేట్స్ అయితే రీసెంట్లీ ప్రొడక్షన్ హౌస్ ఓ చిన్న సమాచారాన్ని పంచుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ దశకు చేరుకుందట. నెవ్వర్ బిఫోర్ క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నారట సంకల్ప్. హై ఆక్డేన్ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో నైట్ ఎఫెక్ట్స్‌లో తీస్తున్నారట. 25 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుందని వెల్లడించింది టీం. ఇదే టైంలో సందీప్ రెడ్డి వంగాతో గోపీచంద్ దిగిన ఓల్డ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ స్పిరిట్‌లో డార్లింగ్ ఢీకొట్టేందుకు డాన్ లీ కన్నా గోపీచంద్ సూటబుల్ అంటూ అతడ్నే తీసుకోవాలంటూ యానిమల్ దర్శకుడికి స్పెషల్ రిక్వెస్టులు పెడుతున్నారు. వర్షం కాంబో మరోసారి తలపడితే ఫ్యాన్స్ కు అంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది.
