లిఫ్ట్ ఎంత సౌకర్యవంతంగా ఉపయోగపడుతుందో.. అంతకంటే ప్రమాదకరమైనది కూడా. ఎక్కడో చోట ప్రతిరోజు లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. షాహిబాగ్‌లోని వసంత్ విహార్ ఫ్లాట్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని 6 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. దీపావళి రోజున ఈ ప్రమాదం జరిగింది. ఆర్య కొఠారి అనే చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ లోకి వెళ్లాడు. ఆర్య కొఠారి లిఫ్ట్‌లోకి వెళ్లిన వెంటనే లిఫ్ట్ డోర్ మూసుకుంది. దీంతో అతను లిఫ్ట్, ఫ్లోర్ మధ్య ఇరుక్కుపోవడంతో.. తల లిఫ్ట్ గేటులో ఇరుక్కుపోయింది.
Read Also: Honey Rose : నడుము వంపులలో నయాగరాలు.. ఆ చూపులకే కుర్రకారు ఫిదా..
సమాచారం అందుకున్న సొసైటీ ప్రజలు అక్కడికి చేరుకుని ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతి కష్టం మీద చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి తల పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని స్థానికులు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Read Also: CM YS Jagan: రేపు మాచర్లకు సీఎం జగన్.. వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన
చిన్నారిని లిఫ్ట్‌లో నుంచి బయటకు తీసిన తర్వాత తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు కూడా చిన్నారి చనిపోయినట్లు తెలిపారు. తమ బిడ్డ తమ వద్ద లేడంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అందుకే లిఫ్ట్‌ల్లో కాకుండా మెట్ల మీదుగా వచ్చి వెళ్లడమే మేలు అని జనాలు అంటున్నారు. ఎప్పుడు ఎలా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఎవరికి తెలియదు. సో బీకేర్ ఫుల్……
