Indore: ఇండోర్‌లో దారుణం.. బల్కానీలో భార్యపై దాడి.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు పేటల తాడు త్వరగా తెగిపోదంటారు పెద్దలు. భార్య మెడలో మూడు ముళ్లు వేసి కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాలనుకున్నాడు ఓ దుర్మార్గపు భర్త. అత్యంత దారుణంగా హింసించి చంపే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) చోటుచేసుకుంది.
జితేంద్ర పర్మార్, పూజా పర్మార్ ఇద్దరూ భార్యాభర్తలు. అయితే భార్య ఉండగానే మూడు నెలల క్రితం జితేంద్ర రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య పూజా పర్మార్‌తో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి బంగంగాలోని నార్వార్‌లో నివసిస్తోంది. అయితే గత ఆదివారం పూజా ఇంట్లో నిద్రిస్తుండగా.. భర్త జితేంద్ర, రెండో భార్య గాయత్రి, తల్లి బసంతీ బాయి, సోదరి పాయల్ ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా దాడికి తెగబడ్డారు.
Also Read
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
పూజాను కత్తితో పొడిచి.. జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్లి బాల్కనీ నుంచి కిందకి పడేసేందుకు భర్త ప్రయత్నించాడు. బాల్కనీలో జరిగిన పెనుగులాటలో ఆమె తలపై ఇటుకుతో విపరీతంగా భర్త దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఇండోర్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్థానికులు ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త, రెండో భార్య, తల్లి, సోదరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భర్త జితేంద్రను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మిగతా వారు పరారీలో ఉన్నారు.
భార్య తలపై ఇటుకతో కొట్టడంతో ఆమెకు విపరీతంగా రక్తస్రావం అయింది. బాధితురాలు తనను విడిచిపెట్టాలని వేడుకుంటున్నప్పటికీ నిందితులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. జితేంద్ర రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
#WATCH | #Indore: Man Brutally Beats Wife, Drags And Strikes Her With Brick; Incident Recorded On Cam#MadhyaPradesh #MPNews pic.twitter.com/VsCZTmDgUH
— Free Press Madhya Pradesh (@FreePressMP) February 28, 2024
తాజావార్తలు
-
Producer Naga Vamsi: నిర్మాతలు ఎందుకు కొట్టుకుంటారో చెప్పేసిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!