వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోరుతూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.. సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న చంద్రబాబు అందులో 10శాతం రాయలసీమకు కేటాయిస్తే అభివృద్ది అవుతుందని పార్టీల నాయకులు పేర్కొన్నారు.. ఆంధ్రపదేశ్ అంటే అమరవతి, పోలవరమే కాదని.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా అన్నారు.. కేంద్రంతో పోరాడి ఎందుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు తీసుకుని రావడం లేదన్నారు.
READ MORE: Warangal: కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్.. ఎమ్మెల్యే కౌంటర్
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలి కొన్ని ప్రాంతాలపై మాత్రమే దృష్టి పెట్టకూడదని.. ఏ ఫర్ అమరావతి. పి ఫర్ పోలవరం అని చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. “వెనుక బడిన ప్రాంతాలలో పెండింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. 36 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చాలలోనే ఉన్నాయి. రానున్న బడ్జెట్ సమావేశాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులు అయినా సాధించి పనులు చేపట్టాలి. అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ అని చంకలు గుద్దుకుని కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఖచ్చితంగా దీనిలో లాలూచీ ఉంది.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Warangal: కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్.. ఎమ్మెల్యే కౌంటర్
ఈ కార్యక్రమానికి వైసీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. “50ఏళ్ల ముఖ్యమంత్రులు పాలించిన రాయలసీమ వెనకబడిపోయింది.. వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉండడం వెనుకబాటుకు కారణం. రాష్ట్రంలో 42శాతం పంటలు పడించేందుకు అవకాశం ఉంటే 9శాతం మాత్రమే ఇరిగేషన్ ఉంది. ఇరిగేషన్ పెంచితే పంటలు పండుతాయి.. శ్రీశైలంలో గుండ్రాగుల వద్ద 20టీఎంసీల రిజర్వాయర్ కట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.. రాజధాని డైవలప్ మెంట్‌కి లక్ష కోట్లు పెడతామని ప్రభుత్వం చెబుతుంది.. 10శాతం రాయలసీమ ప్రాజెక్టులపై పెట్టాలి.. రైస్ బౌల్ ఆంధ్రప్రదేశ్ గా పేరుంది.. పరిశ్రమలకు నీళ్లు ఇవాలన్నా.. వ్యవసాయానికి నీరు ఇవ్వాలన్న ప్రాజెక్టులు పూర్తి కావాలి.. రాయలసీమ అభివృద్ధి కోసం జరిగే పోరాటంలో వైసీపీ కూడా ఉంటుంది..” అని వైసీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు.