NTV Telugu Site icon

Variety Thief: అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ

Theif

Theif

మనం చాలా మంది దొంగలను చూసే ఉంటాము.. దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు.. వారిని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని ముఖానికి మాస్క్ ధరిస్తూ ఉంటారు.. లేదంటే ఏదైనా నలుపు రంగు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. అలా ఏదో ఒక రకంగా తమ ముఖాన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. తాజాగా ఓ దొంగ సెల్ ఫోన్ లో చోరీ చేయడానికి వచ్చాడు. ఆయన అక్కడకు వచ్చాక సీసీ కెమెరాలు ఉంటాయని గుర్తుకు వచ్చింది. దీంతో తన ముఖం కనపడిపోతుందని.. అందుకే తన ముఖాన్ని కవర్ చేయడం కోసం ఆయన చేసిన పని ఇప్పుడు అందరినీ తెగ నవ్వి్స్తుంది.

Read Also: Mumbai : ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసినందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

ఇంతకీ అతను ఏం చేశాడో మీకు తెలుసా..? ఓ అట్టపెట్టను ముఖానికి కవర్ చేసుకొని వచ్చి దొంగతనం చేశాడు. కానీ సెల్ ఫోన్ లు కొట్టేస్తున్న ఆనందంలో ఆ అట్టపెట్ట తన ముఖం నుంచి తొలగిపోయిందనే మాత్రం గమనించలేదు.. ఇంకేముంది.. సీసీ కెమెరాలలో దొంగ ముఖం కనిపించడంతో పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

Read Also: Mahesh Babu: ఏవయ్యా చారీ ఈయనకి అసలు వయసవ్వదా?

అయితే.. ఫ్లోరిడాలోని ఓ సెల్ ఫోన్ షాప్ లో ఇటీవల ఓ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోని పరిశీలించింది. కాగా.. అందులో ఓ వ్యక్తి ముఖానికి అట్ట పెట్ట అడ్డు పెట్టుకొని మరీ చోరీ చేయడానికి వచ్చినట్లు గుర్తించారు. చాలా తెలివిగా ముఖానికి అట్ట పెట్ట పెట్టుకోవడంతో అతను ఎవరో గుర్తించడం కష్టమైంది. కానీ, అతను ఫోన్లు దొరికిన ఆనందంలో తన మొహానికి ఉన్న అట్ట పెట్టే తొలిగిపోయినది.. చూసుకోలేదు. ఇంకేముంది.. అతని ముఖం క్లారిటీగా కనిపిచింది.. దీంతో అతని ఫోటోని సేవ్ చేసుకొని.. అందరికీ ఈ వీడియో చూపించి చివరకు దుకాణం యజమానే స్వయంగా దొంగను పట్టుకున్నాడు. అనంతరం అతనే పోలీసులకు అప్పగించాడు.