NTV Telugu Site icon

Viral Video: బొమ్మ స్కూటర్‌పై ఎలుక అద్భుత విన్యాసాలు.. వీడియో చూశారా..!

Mouse

Mouse

మీ మనస్సు మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, ఏమీ పని చేయాలని లేనప్పుడు చాలామంది సోషల్ మీడియాలోనే గడుపుతుంటారు. అందులో ఫన్నీ వీడియోలు, రీల్స్ చూస్తూ కొద్దీగా రిలాక్స్ అవుతారు. అయితే ఇంటర్నెట్ లో జంతువుల వీడియోలను చాలా మంది నెటిజన్లు ఇష్టపడుతారు. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని భయంకరమైన వీడియోలు ఉంటాయి. అయితే.. తాజాగా ఓ జంతువు చేసిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ముక్కున వేలు వేసుకుంటారు….

CM YS Jagan: నాడు–నేడు రెండో దశ పనులు గడువులోగా పూర్తి చేయాలి..

ఈ రోజుల్లో స్టంట్స్ ఎక్కువగా యువత చేయడం చూస్తుంటాం. అందులో కొత్త కొత్త స్టంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు మనుషులను చూసి జంతువులు కూడా విన్యాసాలు చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియోలో చూస్తే.. ఓ ఎలుక ఒక బొమ్మ స్కూటర్‌పై విన్యాసాలు చేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉండటం కనిపిస్తుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. బొమ్మ స్కూటర్‌పై ఒక చిన్న ఎలుక ఆనందంగా విన్యాసాలు చేస్తూ కనిపిస్తుండటం మీరు చూడవచ్చు. అంతేకాకుండా.. ఆ ఎలుక ఒక ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌లా కనిపిస్తుంది. అక్కడే గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ వీడియోను గమనించి చూస్తే.. ఎలుక స్కూటర్‌ను నడపడం లేదని, ఎవరో రిమోట్‌తో కంట్రోల్‌ చేస్తున్నారని అర్థమవుతుంది.

Viral Video: మేనకోడలు పెళ్లి.. కట్టలు కట్టలుగా డబ్బుల కుప్ప.. వీడియో వైరల్

ఈ వీడియో @AMAZlNGNATURE పేరుతో Xలో పోస్ట్ చేశారు. దానితో పాటు క్యాప్షన్ ఎవరికి రైడ్ కావాలి అని రాశారు. అయితే ఈ వీడియోను ఇప్పటికీ.. 20 లక్షల మందికి పైగా చూశారు. అంతేకాకుండా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక వినియోగదారు.. ఈ ఎలుక నిజంగా స్టంట్‌మ్యాన్ అని రాశాడు. మరొక వినియోగదారు.. నాకు ఎలుకలు ఇష్టం లేనప్పటికీ, ఇది చాలా అందంగా ఉందన్నాడు. ఇలా చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.