Site icon NTV Telugu

Praja Palana Sub-Committee: ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం..

Bahtti Review

Bahtti Review

సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా పాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఐదు గ్యారంటీల అమలు కోసం సుమారు రెండున్నర గంటల పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?. డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది?. ఐదు గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? అనే దానిపై చర్చించారు.

MLA Prem Sagar: అయోధ్య రాముడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం మొదలు పెట్టింది..

ఈ సమావేశంలో సీనియర్ అధికారులు ఐదు గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్ చేయడానికి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఐదు గ్యారెంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డేటాలో డూప్లికేషన్ లేకుండా సీజీజీ, ఐటీ డిపార్ట్మెంట్ తో పాటు మిగతా అన్ని శాఖలు సమిష్టిగా డేటాను షేర్ చేసుకొని శుద్ధమైన డేటాను సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశాలు ఇచ్చారు.

Assam : రూ. 68.41 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు..

ప్రజా పాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ, ఎంట్రీలో కానీ ఎవరు కూడా దరఖాస్తుదారుని ఓటీపీ అడగలేదు. ఓటీపీ అనే అంశం దరఖాస్తులోనే లేదు. ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వవద్దు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. సైబర్ నేరస్తులు అడిగే ఓటీపీకి ప్రజాపాలనలో సేకరించిన దరఖాస్తులకు సంబంధం లేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం తగదని మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు.

Exit mobile version