Site icon NTV Telugu

MLC Kavitha: మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

Kavitha

Kavitha

తెలంగాణలో ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొలిఏకాదశి ముగిసిన తర్వాత బోనాల పండగ ప్రారంభమైవుతుంది. ఈ నెలంతా హైదరాబాద్​ నగరమంతా బోనాల పండగ చేసుకుంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకం. పండగ రోజున అమ్మవారికి నిష్టగా బోనం అలంకరించి అందులో నైవేద్యం వండి డప్పుచప్పుల్లు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారికి ఘనంగా బోనం సమర్పిస్తారు.

Read Also: Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?

ముఖ్యంగా అందరికి బోనాలు అంటేనే గుర్తుకు వచ్చేది గోల్కొండ, లష్కర్ బోనాలు​. తెలంగాణలో ముఖ్య పండుగైనా బోనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. గతవారం గోల్కొండ బోనాలు జరగ్గా ఈ వారం లష్కర్​ బోనాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు బోనాలతో వచ్చి దర్శించుకుని సందడి చేస్తున్నారు. అమ్మవారికి ఉదయం ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో పోతురాజులు నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే.. రేపు (సోమవారం) రంగం జరుగుతుంది. మరోవైపు సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పంచి ప్రత్యేక పూజలు చేశారు.

Read Also: Bandla Ganesh: సిగ్గు లేదా.. మీకు జీవితంలో బుద్ధి రాదు.. మీ బతుకులు చెడ

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ లో నిర్వహించిన పూజలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అయితే.. ఎమ్మెల్సీ కవితకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పండితులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

Read Also: Health Tips : ఈ స్మూతీని రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలో..

బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్​ శ్రేణులతో భారీ బందోబస్తుతో ఆలయానికి వచ్చారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా బోనం ఎత్తుకుని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆమె వెంట బీఆర్ఎస్ నేతలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇక, మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్​ దంపతులు ఉజ్జయినీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. కేసీఆర్ తో పాటు మంత్రులు తలసాని, ఇంద్రకరణ రెడ్డి, ఆలయాధికారులు పూర్ణకుంభంతో సీఎం దంపతులకు స్వాగతం పలికారు.

Exit mobile version