NTV Telugu Site icon

Viral: తన చిలిపి చేష్టలతో వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించిన కోతి..!

Monkey

Monkey

అనేకమార్లు కోతి చేష్టలు మనకి కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు మాత్రం తెగ నవ్వును తెప్పిస్తాయి. మరికొన్ని సార్లైతే మాత్రం ఆశ్చర్యం కూడా కలిగిస్తుంటాయి. మనుషులపై ముఖ్యంగా తిను పదార్థాల కోసం దాడులు చేసే సమయాలలో కోతులను చూశాం., అంతే కాదండోయ్.. మన ఇళ్లలోకి కొన్నిసార్లు వచ్చి ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లే కోతులను కూడా చూసే ఉంటాము. ఇది ఇలా ఉండగా కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా చేస్తాయి.

Read Also: Viral: రొమాంటిక్ మూడ్‌ లోకి వచ్చిన గుర్రం.. చివరికి ఆమె చేసిన పనికి షాక్..!

తాజాగా ఇలాంటి ఓ విచిత్ర ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతి స్కూటీపై కూర్చుని ఓ వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించింది. వృద్ధుడి స్కూటీ ఎక్కి దిగనంటే దిగనంటూ అంటూ చేసిన నిర్వాకం చూసి అంతా అవక్కయ్యారు. ఇకపోతే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మెయిన్‌ పురిలో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడు స్కూటీ పై కూర్చుని ఉండగా.. అక్కడికి అనుకోకుండా ఓ కోతి వస్తుంది. ఆ కోతి వచ్చీ రాగానే.. ఒక్కసారిగా పైకి ఎగిరి స్కూటీ హ్యాండిల్‌ పై కూర్చుంటుంది. ఈ దెబ్బతో ఆ వృద్ధుడు మొదట భయపడిపోతాడు. ఆ కోతి ఎక్కడ తన పై కూడా దాడి చేస్తుందోనని భయపడతాడు.

Read Also: BRS Aroori Ramesh: ఆరూరి రాజీనామా ప్రకటన.. హనుమకొండలో పొలిటికల్‌ హై డ్రామా..

కాకపోతే ఆ కోతి అతన్ని ఏమీ చేయకుండా ఆయన కళ్లద్దాలను లాక్కుంది. ఈ సంఘటనతో వృద్ధుడు కూడా పైకి నవ్వుతూ.. ‘‘అద్దాలు తీసుకోవద్దు.. పగిలిపోతాయ్.. ఇవ్వు ’’.. అంటూ వాటిని తీసుకుంటాడు. ఆపై కోతి వృద్ధుడి తలపై చేతులు పెట్టి అతడి వైపే చూస్తుంది. దాంతో ఆ వ్యజతి కూడా కోతితో స్నేహంగా మాట్లాడతాడు. ఆ సమయంలో కోతిని అక్కడి నుంచి పంపించేందుకు.. బిస్కట్లు తెప్పించాలని ట్రై చేస్తాడు. అయినా కానీ కోతి మాత్రం పక్కకు వెళ్లకుండా అతడి వైపే చూస్తూ ఉంది. ఇలా కొద్ది సేపు కోతి స్కూటీ పైనే కూర్చుని ఉంది. ఈ వీడియోకు గాను నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ కోతి బలే తమాషాగా ఉందే.. అంటూ ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.