Site icon NTV Telugu

America: డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేసి 10 మంది ప్రాణాలు తీసిన నర్సు..

Nurse

Nurse

అమెరికలో ఓ విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నర్స్ చేసిన పని వల్ల దాదాపు పది మంది వరకు అమాయక రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూఎస్ లోని ఒరెగాన్‌లోని ఒక ఆసుపత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో 10 మంది రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మందులు చోరీకి గురి కావడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.. గత నెల ప్రారంభంలో ఒక మాజీ ఎంప్లయ్ మందులను దొంగిలించాడని ఆసుపత్రి అధికారులు పోలీసులను అలర్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: AUS vs PAK: వార్నర్ ఆఖరి పంచ్.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం! సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

అయితే, హస్పటల్ లో పేషెంట్స్ కు ఇచ్చే పెయిన్ కీల్లర్ ఇంజెక్షన్ ఫెంటానిల్ దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు నర్సు సదరు రోగులకు డ్రిప్ వాటర్ ని ఇంజెక్ట్ చేసిందని సోర్సెస్ చెప్పింది. ఈ ఆసుపత్రిలో మరణించిన వ్యక్తుల మరణాలు ఇన్‌ఫెక్షన్ కారణంగానే జరిగిందని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల బంధువులు ఆరోపించారు. సదరు నర్సు నొప్పి మందుకి బదులుగా డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పేర్కొనింది. ఇక, మెడ్‌ఫోర్డ్‌లోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మరణాలు మెడిసిన్ చోరీ వల్ల జరిగిందా లేక ట్యాంపరింగ్ వల్ల జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Exit mobile version