AP Crime: అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంపై కలకలం రేగింది. అయితే ఇవి ఆత్మహత్యలు కావని, హత్యలని పోలీసులు తెలిపారు. భార్య, కూతురిని హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు. పాలసుబ్బారావు క్రికెట్ బెట్టింగ్, వ్యవసనాల కోసం 60 లక్షల రూపాయలు అప్పులుచేశాడని, ఇవి తీర్చలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు. భార్య పద్మావతి, కుమార్తె వినయలకు ఇంట్లో మత్తు మందిచ్చి హత్య చేశాడని, తరువాత సైకిల్ పై పెళ్లి వెంకట్రాద్రి ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ప్రభుత్వ భూమి ఆన్‌లైన్ చేసుకొని చేతులు మారడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారని చెప్పారు. కాగా, తమ భూమిని ఆన్‌లైన్‌లో చేయడంలో రెవెన్యూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త కలకలం రేపిన విషయం విదితమే.. తల్లి, కూతురు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే.. కుటుంబ యజమాని సుబ్బారావు మాత్రం.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు.. తన భార్య, కూతురిని హత్య చేసిన సుబ్బారావు.. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు తేల్చారు.. ఈ కేసులో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Fire In Temple: ఆలయంలో పెను ప్రమాదం.. హారతిలో మంటలు ..12మందికి గాయాలు