Site icon NTV Telugu

AP Crime: ప్రొద్దుటూరు హత్య కేసులో ట్విస్ట్..! అందుకే చంపేశా..

Crime

Crime

AP Crime: ప్రొద్దుటూరు ఓ యువకుడి హత్య కేసు కలకలం సృష్టిచింది.. తన తల్లితో సహజీవనం వద్దని వారించినందుకు ఓ వ్యక్తి ఆమె కుమారుడిని హత్య చేసినట్టు వార్తలు వచ్చాయి.. అయితే, ఈ హత్య కేసులో ఓ ట్విస్ట్‌ వచ్చి చే రింది.. మద్యం మత్తులో తనను ఏమైనా చేస్తాడేమోనని భయంతో తాను సహజీవనం చేస్తున్న మహిళ కొడుకుని చంపేసినట్టు నిందితుడు ఒప్పుకున్నారు.

Read Also: Pranava East Crest: లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈస్ట్‌ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే..

కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నాగరత్నమ్మకు గతంలో వివాహం జరిగి భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా సహజీవనానికి దారి తీసింది.. దాదాపు 15 సంవత్సరాల నుంచి అతనితో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుంది. నాగరత్నమ్మకు ముందు భర్తతో మహేశ్వరరెడ్డి అనే సంతానం ఉంది.. మహేశ్వర్ రెడ్డి, నాగరత్నమ్మ ,రామచంద్ర రెడ్డి ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే, ఇటీవల మహేశ్వర్ రెడ్డి మద్యానికి బానిస అయ్యి ప్రతిరోజు ఇంటికి వచ్చి రామచంద్రారెడ్డి, తల్లి నాగరత్నమ్మతో గొడవ పడుతుండేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 23వ తేదీన.. మహేశ్వర్ రెడ్డి మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లితో సహజీవనం చేస్తున్న రామచంద్రారెడ్డితో డబ్బు కోసం గొడవపడ్డాడు. రామచంద్ర రెడ్డి, నాగరత్నమ్మ వద్ద మూడు లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి తన తల్లికి ఇచ్చేస్తే తన తల్లి, తాను ఇరువురం కలిసి మరెక్కడైనా జీవిస్తామని గొడవ పడుతున్న సమయంలో మహేశ్వర్ రెడ్డి వాదనకు దిగాడు.. దీంతో నాగరత్నమ్మను తనకు కాకుండా చేస్తాడని అంతేకాకుండా మద్యం మత్తులో మహేశ్వర్ రెడ్డి తనని ఏమైనా చంపేస్తాడేమో అని అనుమానంతో రామచంద్రారెడ్డి ఈనెల 23వ తేదీ రాత్రి మహేశ్వర్ రెడ్డి నిద్రిస్తున్న సమయంలో రాడ్డుతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం శవాన్ని మూడు ముక్కలుగా కోసి ఒక బ్యాగులో శవాన్ని కుక్కి ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో పడేసి పారిపోయాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు శవాన్ని గుర్తించి తదనంతరం ఈరోజు చాపాడు వద్ద రామచంద్రారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version