ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు పేరుతో మోసాలు పెరుగుతున్నాయి.. ఒక్కో ఉద్యోగానికి లక్షలు డిమాండ్ చేస్తున్నారు కేటుగాళ్ళు… నిందితుల్లో ఏయూ ఉద్యోగులు ఉన్నారు.. ఉద్యోగం రాక మోసపోయి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల పేరిట మోసం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు దర్యాప్తు చెయ్యకుండ.. సమస్య పరిష్కారం జరిగిందని కేసును క్లోజ్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
READ MORE: Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆరిలోవ పోలీస్ స్టేషన్ కి అక్కడ నుంచి మరొక స్టేషన్ ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఈ మేరకు బాధితులు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభం చేసి ప్రాబ్లెమ్ సాల్వ్ అంటూ ఫైల్ క్లోజ్ చేశారు. సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించబడిందని మెసేజ్ రావడంతో బాధితులు అవాక్కయ్యారు.
READ MORE: TECNO Phantom V Flip 5G: క్రేజీ డీల్.. రూ. 72 వేల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ రూ. 26 వేలకే